Connect with us

Kakinada

నూకలమ్మ తల్లి మహిమ చూడండి!

BR9TV NEWS

Published

on

కుళాయి చెరువు త్రవ్వకాల్లో.. స్వయంభువుగా బయల్పడిన కాకనందివాడ దేవత
*115 వసంతాల కాకినాడనూకాలమ్మ*
(2024 క్రోధి నామ సంవత్సర ఉగాది రాక సందర్భంగా ప్రత్యేక వ్యాసం..)
అంతర్జాతీయ స్థాయిలో కో-కెనడా గా పేరొందిన అలనాటి కాకనందివాడ నేటి కాకినాడ. స్వాతం త్ర్యానికి పూర్వం కృత్తి వెంటి పేర్రాజుపంతులు (వారి నామకరణమే పేర్రాజు పేట) ప్రప్రధమ పురపాలక అధ్యక్షుడు గా వున్న రోజులవి.. అప్పటి 1909 లో విక్టోరియా వాటర్ వర్క్స్ ఏర్పాటుకు జరిగిన కాకినాడ కుళాయి చెరువు త్రవ్వకాలలో నదీ గర్భంలో గునపం మొనకు తగిలిన రాతి ప్రతిమ బంగారు ముక్కెర తో అదిమి వున్న మట్టిపెళ్ళ బయల్పడింది. అమ్మల గన్న అమ్మగా గ్రామ దేవత నూకాలమ్మ కొత్త కాకినాడలో వెలుగొందిం దని వళ్ళు గుగుర్పొ డిచిన క్షణాల్లో అక్కడి కూలీలు మాట్లాడిన మాటలవి.. ఈ విషయం పిఠాపురం రాజా కి తెలిసి అక్కడి నాలుగు రోడ్ల కూడలిని ఆనుకుని వున్న స్థలాలను గ్రామ దేవత కొలువు కోసం ఏర్పాటు చేశారు. ఆలయం వెనుక రామారావు పేట (పిఠాపురం రాజా వారి తండ్రి గంగాధర రామా రావు బహుదూర్ పేరు) ఆలయం ముందు సూర్యారావు పేట (రావు మహీపతి వెంకట సూర్యారావు బహుదూర్ పేరు) ముఖ ద్వారం ఎదురుగా రేచర్ల పేట( పిఠాపురం రాజా వారి గోత్రం రేచర్ల) రైల్వే గేటు మార్గం వుంటుంది. జగన్నాధపురం పాత కాకినాడ కాగా.. కొత్త కాకినాడ ప్రాంతంగా ఆనాడు ఇక్కడి ప్రాంతం జిల్లా ప్రసిద్ది.. ఆ మేరకు కొత్తకాకినాడకు నూకా లమ్మతల్లిగా పేరొందిం ది. నూకాలమ్మ సేవకు జాతర మాసంలో ఇతోధికంగా వారి ఇండ్లల్లో ఇంటి ఆడపడుచుగా పూజిస్తూ పాన్పులు వేసి కొలుచుకున్న మహనీయులు ఎంతో మందివున్నారు. రాతి ప్రతిమతో బాటుగా బయల్పడిన బంగారు ముక్కెర వెనుక అనేక ఇతిహాసాలున్నాయి. కాకినాడ ఫ్రెంచ్ డచ్ వారు పాలించడానికి ముందు పూర్వ కాలం 17వ శతాబ్ధారంభంలో కాకనందివాడ వంశీయు లు పాలించిన చరిత్ర. ఆ వంశీయులు అప్పటి రోజుల్లో ఇక్కడి అడవి మార్గంగా దట్టమైన వృక్ష సముదాయం వున్న ప్రదేశంలో ప్రతి ఏటా దేవతారాధనకు ఇంటి ఆడపడుచులతో వచ్చే వారని అప్పటి ఆరాధనలో ముక్కెరలు విధిగా ధరించేవారని ప్రధాన ఆడపడుచు ప్రయాణంలో ముక్కెర పోగొట్టుకున్న దృష్టాం తంతో బాటుగా వారు వెంట తెచ్చుకుని పూజించే దేవత ప్రతిమ అంతర్ధానమయ్యిందని ఆ తరుణం నుండే కాకనందివాడ వంశీ యుల కాలం అంతరిం చడం ఆరంభమయ్యిం దని పేర్కొంటారు. ఇది పూర్వీకులు మాట్లాడు కున్న మూలవిరాట్ చరిత్ర కథనం. ఇప్పటికీ ఇక్కడి నూకాలమ్మతల్లి విగ్రహానికి అమర్చే ముక్కుపుడక బహు అపురూపమైనది. ఆ ముక్కెర తీయడం పెట్టడంలో తిథి వార నక్షత్రాలు అనుకూలంగా లేకుంటే అనేక కాల మాన దోష అనర్థాలు సంభవిస్తుంటాయని ఆధ్యాత్మిక ప్రసిద్దులు తెలిపే హెచ్చరిక. చరిత్ర కాలగమనంలో ఆలయ నిర్వాహణ వేలం పాట ల్లో పెరిగిన భక్తులఆర్థిక అవస్థలపై శ్రీ గణపతి యువజన సంఘం టు టౌన్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యాన సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు సారథ్యం లో సూర్యారావు పేట యువత 1989లో కన్నెర్ర జేసి ఆలయాన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి 1990లో ఎండో మెంట్స్ నిర్వహణలోకి తీసుకువచ్చింది. గ్రామదేవతకు అనాదిగా ” బడే ” కుటుంబం ఆడపడుచులు నిత్య ధూప దీప షోడశోప చార పూజాధికాలు నిర్వహిస్తారు. ముక్కెర ధరించి దర్శించే ఆడపడుచులకు కల్పవల్లిగా కాకినాడ కొత్తపేట నూకాలమ్మ తల్లి అనుగ్రహిస్తుం దనేది ఆధ్యాత్మికపరు ల్లో వున్న ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయం కాకినాడ రైల్వే స్టేషన్ కు అతిదగ్గరలో, ఆర్ టి సి కాంప్లెక్స్ కు సమీపంగా వున్న టుటౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో, కుళాయి చెరువు రాజాట్యాంక్ పార్కు వద్ద నాలుగు రోడ్ల కూడలి లో వుంది. ఆలయం అతిచిన్నదయినా కాకినాడ వాసులు ఇక్కడి నూకాలమ్మను దర్శించకుండా స్మరించకుండా ఎటువంటి ప్రయాణాలు చేపట్టరన్నది అతిశయోక్తి కాదు. ఈ ఏడాది 2024′ 9వతేదీ మంగళవారం ఉగాది .. ముందు రోజు 8వ తేదీ సోమవారం రాత్రి జాతర, మరునాడు ఉత్సవ వేడుక సంప్రదాయం. 1866లో ఏర్పడిన 158 వసంతా ల కాకినాడనగరానికి వన్నె తరగని ముక్కెర గా, గలగలా పారే ధన ధన డప్పుల నడుమ గరగల మువ్వలసవ్వడి తో ఏటేటా 115 సంవత్సరాల చారిత్రాత్మక భాగ్యసిద్ధియై వర్ధిల్లుతోంది!! కాకనంది వాడ వంశీయుల మూల విరాట్ ప్రతిమా దేవత
కాకినాడ నూకాలమ్మ!! కాకినాడ స్థానికులు దేశ విదేశాల్లో ఎక్కడ వున్నా ఉగాది రోజున శ్రీనూకాలమ్మ తల్లిని గుర్తు చేసుకోని వారుండరు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

AP NEWS

BR9TV NEWS

Published

on

https://youtu.be/CdUd9horrYg?si=kZI0MKP4ILqo0IEk

Continue Reading

Trending

Share via