AP NEWS
*శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు*
శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఈ ఉత్సవాల తొలి రోజు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
భ్రమరాంబ దేవి అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు.
ఆలయ ప్రాంగణంలో అర్చకులు, వేద పండితులు శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.
కళాకారుల నృత్యాలు, కోలాటాల సందడి నడుమ ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు.